సీఎం చంద్రబాబుతో పవన్ కల్యాణ్, మాధవ్ భేటీ
మున్సిపల్ ఎన్నికల తరహాలోనే సర్దుబాటు
జనసేనకు ఐదు వరకు జెడ్సీ పీఠాలు?.. రెబల్స్ అంశంపై సుదీర్ఘ చర్చ
అమరావతి, : రాష్ట్రంలో జరుగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అగ్ర నాయకత్వం ఒక సీట్ల సర్దుబాటు దాదాపు కాలిక్కి వచ్చింది. స్థానిక బలాబలాలు ప్రాతిపదికన మున్సిపల్ ఎన్నికల తరహాలోనే కూటమి ఆగ్ర నాయకత్వం అవగాహనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. శుక్రవారం టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుతో జనసేనాని పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్ భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ భేటీలో సీట్ల సర్దుబాటు అంశంపై ఒక ఒప్పందం కుదిరినట్లుగా విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వరుసగా రెండో రోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యతను సం తరించుకుంది. దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన ఈ ప్రత్యేక భేటీలో సీట్ల సర్దుబాటుతో పాటు మూడు పార్టీల్లోని రెబల్స్ అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. స్థానిక సంస్థల నామినేషన్ల గడువు ముగిసిన నేపథ్యంలో మూడు పార్టీల మధ్య సమన్వయం అత్యంత కీలకం కావడంతో అధినేతలు ఈ అంశంపై చర్చించారు. ఓ వైపు మున్సిపల్ ఎన్నికల్లో మూడు పార్టీల రెబల్ అభ్యర్థులు బరిలో ఉండటం, ఇంకోవైపు ఎంపీటీసీ, జెడ్సిటీన్ ఎన్నికల్లో సైతం కూటమి వక్షాల అశావాహులు నామినేషన్లు దాఖలు చేయడంతో అధిష్టానాలకు తలనొప్పిగా మారింది. ఈనేపథ్యంలో -అశావాహులను బుజ్జగించి తమ దారిలోకి తెచ్చు కునే అవకాశాలపై అగ్రనాయకత్వం చర్చలు జరిపింది. బుజ్జగించినా దారిలోకి రాని కొందరు నేతలను అవ సరం అయితే పార్టీలో నుంచి బహిష్కరించేందుకు ఆయా పార్టీల అగ్రనేతలు నిర్ణయించినట్లుగా తెలు స్తోంది. ఈక్రమంలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉ ంటాయన్న అసక్తి సర్వత్రా నెలకొంది. కాన్ని ప్రాంతాల్లో రెబల్ అభ్యర్థుల ప్రభావం చూపే అవ కాశం ఉ ండటంతో దీని పైన అగ్రనేతలు చర్చించి నట్లుగా సమాచారం.
జనసేనకు ఐదు జెడ్పీ పీఠాలు..?
ఇదిలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమా చారం మేరకు జనసేనకు ఐదు జెడ్సీ పీఠాలు దక్కే అవకాశం ఉ న్నట్లు తెలు స్తోంది. తాజా భేటీలో జనసేన నేత పవన్ కల్యాణ్ 30 శాతం సీట్లతో పాటు మున్సిపల్ తరహాలోనే ఐదు జెడ్సీపీఠాలను తమకు కేటాయించాల్సిందిగా ప్రతి పాదన చేసినట్లు వెల్లడౌ ది పీఠాలు జనసేన, ఓజేపీలకు కేటాయిస్తారనే అంశం తోంది. అయితే ఏఏ జెడ్సీ ఇంకా స్పష్టతకు రాలేదు. తాజా పరిణామాలకు అను గుణంగా నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే లోగా మూడు పార్టీల అదినేతలు ఈ అంశంపై ఒక నిర్దిష్టమైన అభిప్రాయానికి సర్దుబాటుకు వచ్చే అవ కాశం ఉన్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో జరి గిన సర్దుబాటును పరిశీలిస్తే జనసేనకు 24 స్థానాలను కేటాయించగా, బీజేపీకి తొమ్మిది స్థానాలను కేటాయిం చారు. ఈ సర్దుబాటును పరిశీలిస్తే జనసేనకు 20 శాతం, మేరకు సీట్లు దక్కగా, బీజేపీకి 7 శాతం వాటాను దక్కించుకుంది. ఈ దమాష ప్రకారం జెడ్సీ పీఠాల్లో కేటాయింపులు ఉంటాయని సమాచారం. అయితే పంచాయతీరాజ్ విభాగానికి సంబంధించిన ఎన్నికలు కావడంతో అశాఖనే నిర్వర్తిస్తున్న పవన్ కళ్యాణ్ అత్య ధిర మండలాధ్యక్షులు స్థానాలతో పాటు జెడ్సీ స్థానా లను అశిస్తున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు ఏడు నుంచి ఎనిమిది జెడ్బీ పేలాలను అ పార్టీ అశిస్తుండగా, ఐదు Tడ్సీ చైర్మన్ పదవులను కేటాయించేందుకు సూత్ర ప్రాయ అంగీకారం టీడీపీ నుంచి వచ్చినట్లుగా వార్త లు వినిపిస్తున్నాయి. అయితే బీజేపీరి సంబంధించి ఒక జెడ్సీ చైర్మన్ పదవిని కేటాయించేఅవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయా జిల్లాల్లో ఆయా పార్టీల బలాబలా లకు అనుగుణంగా జెడ్సీల సర్దుబాటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.
రెబల్స్‌కు చెక్.. సమన్వయంతో ముందుకు
తాజాగా జరిగిన కూటమి ఆగ్రనాయకత్వం భేటీలో రెబల్స్ అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. మూడు పార్టీలకు సవాల్ గా మారిన ఈ అంశానికి చెక్ పెట్టే దిశగా అధినాయకత్వాలు ఒక ఆలోచనకు వచ్చి నట్లుగా నెల్లదౌతోంది. మున్సిపాలిటీల్లో ఉపసంహా రణ గడువు కూడా ముగియడంతో ప్రస్తుతం జరుగు తున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో రెబల్స్ అంశంపై అధినాయకత్వాలు దృష్టి పెట్టాయి. సాధ్యమైనంత వరకు రెబల్స్ అభ్యర్థులను బుజ్జగించి దారిలోకి తెచ్చుకోవాలని తమ లను నిర్ణయించాయి. అధిష్టానాల సిర్ణయా గౌరవించకుండా బరిలో ఉండే అభ్యర్థులపై బహిష్కరణ వేటు వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటు బుజ్జగింపులు, అటు క్రమశిక్షణ చర్యలు ద్వారా రెబల్స్స్న చెకపెట్టాలని మూడు పార్టీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఎన్నికల్లో అత్యంత కీల కమైన సమన్వయంపైన అధినేతలు చర్చించారు. ఇప్ప టికే కాన్ని ప్రాంతాల్లో మూడు పార్టీల నేతల మధ్య అధి పత్య పోరు, అసంతృప్తులు కనిపిస్తున్న నేపథ్యంలో వారందరినీ ఏకతాటిపై తెచ్చేందుకు చర్యలు చేపట్టా అని నిర్ణయం తీసుకున్నారు. కో ఆర్డినేషన్ కమిటీల ద్వారా అసంతృప్తులకు కళ్లెం వేసి మూడు పార్టీల నేతలు సమన్వయంతో ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేసే విధంగా కార్యచరణను సిద్ధం చేయనున్నారు.