ప్రమాద ప్రాంతాల నుంచి 97 కుటుంబాలు, 257 మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు
జీవీఎంసీ పరిధిలో 56 పునరావాస కేంద్రాలు, బాధితులకు ఆహారం పంపిణీ
కంట్రోల్ రూమ్‌లకు వచ్చిన ఫిర్యాదులపై తక్షణ స్పందన, తగిన సహాయం
ఈ నెల 21 నుంచి 25 వరకు జిల్లాలో 332.7 మి.మీ. సగటు వర్షపాతం
వాయుగుండం, వర్షాల పరిస్థితిపై వివరాలు వెల్లడించిన జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్
విశాఖపట్నం, : జిల్లాలో గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, తీవ్ర వాయుగుండం ప్రభావం. నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ తెలిపారు. కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ రూమ్, జీవీఎంసీ సిటీ ఆపరేషన్స్ సెంటర్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేశారని చెప్పారు. ముంపు, కొండచరియలు విరిగిపడే నమాదం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యల్లో భాగంగా 97 కుటుంబాలకు చెందిన 257 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి, పునరావాస కేంద్రాల్లో ఆహారం, ఇతర అవసరమైన సౌకర్యాలు కల్పించామని తెలిపారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వర్షాలు, వాయుగుండం ప్రభావంపై ప్రాథమిక వివరాలను వెల్లడించారు. సెప్టెంబర్ 21 నుంచి 25వ తేదీ ఉదయం 10 గంటల వరకు జిల్లాలో సగటున 332.7 మి.మీ. వర్షపాతం నమోదైందని కలెక్టర్ తెలిపారు. విశాఖపట్నం రూరల్‌లో పటంలో మి.మీ. సీతమ్మధారలో 398.6 మి.మీ., గోపాలపట్నంలో 375.2 మి.మీ., మహారాణిపేటలో 367.4 మి.మీ., ములగాడలో 364.2పెదగంట్యాడలో 2.2., 360.8 2.2., పెందుర్తిలో 348 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు వివరించారు. గంభీరగెడ్డ రిజర్వాయర్ పూర్తి నీటిమట్టం 126 అడుగులకు చేరుకుందని, ప్రస్తుతం సుమారు 100 క్యూసెక్కుల ఇన్‌లో వస్తుండగా అదే స్థాయిలో మిగులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. మేఘాద్రిగెడ్డ, రాయవాడ, తాటిపూడి రిజర్వాయర్లలో నీటిమట్టాలు సురక్షిత స్థాయిలో ఉన్నాయని, ప్రస్తుతం ఎలాంటి హెచ్చరికలు అవసరం లేదని చెప్పారు. ముంపు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రూరల్‌లో 40, సీతమ్మధారలో 25, గోపాలపట్నంలో 23, ములగాడలో 4, మహారాణిపేటలో 3, గాజువాకలో 2 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వివరించారు. జీవీఎంసీ పరిధిలో 56 పునరావాస కేంద్రాలను అందుబాటులో ఉంచి, అక్కడ ఆశ్రయం పొందిన వారికి ఆహారం అందించినట్లు పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలో 12 ఇళ్లు దెబ్బతిన్నాయని, వీటిలో 7 ఇళ్లు పూర్తిగా లేదా తీవ్రంగా, 5 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు చెప్పారు. విద్యుత్ శాఖకు సంబంధించి ఒక సబ్ స్టేషన్, 36 విద్యుత్ ఫీడర్లు, 181 విద్యుక్ స్తంభాలు దెబ్బతినగా, 28,934 విద్యుత్ కనెక్షన్లపై ప్రభావం పడిందని తెలిపారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు అధికారులు చర్యలు చేపట్టారని చెప్పారు. ఆర్అండ్బై పరిధిలో 11.5 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని, తాత్కాలిక మరమ్మతులకు రూ.30 లక్షలు, శాశ్వత పునరుద్ధరణకు రూ.5.6 కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేసినట్లు పేర్కొన్నారు. 122 చెట్లు కూలిపోగా, ఇప్పటికే 116 చెట్లను తొలగించి రాకపోకలను పునరుద్ధరించినట్లు తెలిపారు. మిగిలిన చెట్ల తొలగింపు పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఉద్యాన పంటలకు సంబంధించి ఆనందపురం, భీమునిపట్నం మండలాల్లోని నాలుగు గ్రామాల్లో 34 మంది రైతులకు చెందిన 6.48 హెక్టార్ల అరటి పంట దెబ్బతిన్నట్లు తెలిపారు. ఆనందపురంలో ఒక పశువుల పాక దెబ్బతినగా, చినగదిలి, పెదగంట్యాడ మండలాల్లో ఒక దూడ, ఒక గేదె మృతి చెందినట్లు వివరించారు. జిల్లాలో 13 పాఠశాలల భవనాలు లేదా ప్రహరీ గోడలు పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలిపారు. వర్షాల పరిస్థితిపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, అత్యవసర సమాచారంపై తక్షణ స్పందించేందుకు కలెక్టరేట్ కమాండ్ ముందస్తు చర్యలు చేపట్టిందని తెలిపారు. పరిస్థితిని కంట్రోల్ రూమ్, జీవీఎంసీ సిటీ ఆపరేషన్స్ సెంటర్ నిరంతరం పనిచేశాయని కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ రూమ్క అందిన 66 ఫిర్యాదులనూ వరిష్కరించినట్లు తెలిపారు. జీవీఎంసీ సిటీ ఆపరేషన్స్ సెంటర్‌కు అందిన 179 ఫిర్యాదుల్లో 163 పరిష్కరించగా, మిగిలిన 16 ఫిర్యాదులపై పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. భారీ వర్షాలు, తీవ్ర వాయుగుండం ప్రభావం నేపథ్యంలో ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ జిల్లా యంత్రాంగం అన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చోట్ల తక్షణ సహాయం అందించడంతో పాటు మౌలిక వసతుల పునరుద్ధరణకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు జిల్లాలో ఎలాంటి మానవ ప్రాణనష్టం నమోదు కాలేదని కలెక్టర్ స్పష్టం చేశారు.