ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఫారం-6లో కీలక మార్పు చేసిన ఈన్
సర్ పూర్తయిన రాష్ట్రాలకు వర్తింపు
న్యూఢిల్లీ : ఓటరు జాబితా ప్రత్యేక నవరణ (నర్) వివాదం కొనసాగుతున్న వేళ భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటరు జాబితాలో కొత్తగా పేరు నమోదు చేసుకునే వారికి సంబంధించిన ఫారం-6లో కీలక మార్పు చేసింది. సర్ ప్రక్రియ పూర్తయిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఫారం-6తో పాటు జత చేసిన అదనపు సర్ డిక్లరేషన్‌ను తొలగించింది. అదనపు నిబంధన కేవలం సవరణ ప్రక్రియ జరిగే నమ యంలో మాత్రమే వర్తిస్తుందని, సర్ ప్రక్రియ కొనసా గుతున్న రాష్ట్రాల్లో మాత్రం వర్తించదని తెలిపింది. సీఈసీ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు శుభ్బర్ సింగ్ సంధు, వివేక్ జోషితో కూడిన పూర్తిస్థాయి కమిషన్ ఈనెల 26న సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈసీ నిర్ణయం ప్రకారం, సర్ ప్రక్రియ పూర్తయిన ప్రాంతాల్లో కొత్త ఓటర్లు ఇకపై ఎన్నికల నిబంధనల ప్రకారం నిర్దేశించిన సాధారణ ఫారం-6ను మాత్రమే పూర్తి చేయా ల్సి ఉంటుంది. సర్ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాత్రం అదనపు డిక్లరేషన్ అందుబాటులో ఉంది. కొత్తగా ఓటరుగా నమోదు కావాలనుకునే దరఖాస్తుదారులు తాము లేదా తమ తల్లిదండ్రులు, తాతయ్యలు, అమ్మమ్మలు గతంలో జరిగిన ప్రత్యేక సమగ్ర నవరణ సమయంలో రూపొందిం చిన ఓటర్ల జాబితాల్లో ఉన్నారనే వివరాలను అందించాల్సి ఉంటుంది. ఈ అదనపు ప్రకటనను నర్ ప్రక్రియలో భాగంగానే ఎన్నికల సంఘం తీసుకొచ్చింది. అయితే సవరణ పూర్తయిన ప్రాంతాల్లో దాని అవసరం ఉండదని స్పష్టం చేస్తూ తాజాగా ఆప్షన్‌ను తొలగించింది. నర్ పూ-ర్తయిన ప్రాంతాల్లో అదనవు డిక్లరేషన్‌ను ఈసీఐనెట్ యాప్, పోర్టల్ నుంచి తొలగించారు. సంబం ధిత రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ) వెబ్సైట్లలోనూ ఇదే మార్పు చేశారు. ఇక ఆయా రాష్ట్రాల్లో ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకునే పౌరులు రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్, 1960 ప్రకారం నిర్దేశించిన ఫారం-6లో అవస రమైన వివరాలను మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. ఫారం- 6కు జత చేసిన అదనపు డిక్లరేషన్ కేవలం సర్? ప్రక్రియ కోనమేనని అందులో ఈసీ పేర్కొంది. సర్? అమలు లేని సమయంలో రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్, 1960 ప్రకారం వర్తించే సాధారణ ఫారమ్‌లనే ఉ పయోగిస్తామని స్పష్టం చేసింది. దీంతో సర్ పూర్తయిన ప్రాంతాల్లో సాధారణ ఫారం-6 ప్రక్రియకు తిరిగి వెళ్లేలా ఆన్లైన్ వ్యవస్థలో మార్పులు చేశారు. కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించిన చట్టబద్ద ప్రక్రియలో అదనపు సర్ వివరాలను అడగడం ఇకపై ఉండదు. ఫారం-6కు సంబంధించిన మార్పులపై కమిషనర్లు నందు, జోషి అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వార్తలు రావ టం ఇటీవల వివాదాస్పదంగా మారింది. ఫారం-6లో చేసిన మార్పుల అంశం గతంలో ఎన్నికల సంఘంలోనే చర్చనీయాం శమైంది. ఓటర్ల జాబితాలో పేరు చేర్చుకునేం దుకు అర్హులైన భారతీయ పౌరులు ఉపయోగించే చట్టబద్ధమైన ఫారమ్ గానే ఫారం 6ను రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్, 1960 నిర్దేశిస్తుంది. ఈ ఫారమ్‌లో మార్పులు చేయడంపై ఎన్నికల కమిషనర్ వివేక్ జోషి, సుబ్బేర్ సింగ్ సంధు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. నిబంధ నల ద్వారా నిర్దేశించిన ఫారమ్‌ను సంబంధిత నిబంధ నలను సవరించకుండా మార్చలేదని, అలాగే ఈసీఐనె ట్లో ఫారం-6 దరఖాస్తు ప్రక్రియకు నర్కు సంబం ధించిన అదనపు డిక్లరేషన్‌ను జత చేయడంపైనా సంధు అభ్యంతరం వ్యక్తం చేశారు.