సేవల నాణ్యత, శాఖల సమన్వయం,
ఆధారబద్ధమైన కార్యాచరణకు ప్రాధాన్యం
మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ
మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
విశాఖపట్నం, : రాష్ట్రంలో మహిళలు, పిల్లల పోషకాహార స్థితిని మెరుగుపరిచి ఆశించిన ఫలితాలను వేగంగా సాధించేందుకు సేవల నాణ్యతను పెంచడంతో పాటు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయాలని మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. నగరంలోని నోవాటెల్లో మంగళవారం నిర్వహించిన 'ఆంధ్రప్రదేశ్లో పోషకాహార ఫలితాలను వేగవంతం చేయడం' రాష్ట్రస్థాయి నదస్సు ప్రారంభ సమావేశంలో ఆమె మాట్లాడారు. స్వర్ణాంధ్ర లక్ష్యం ఆర్థిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకే పరిమితం కాదని, ఆరోగ్యవంతమైన తల్లులు, ఆరోగ్యంగా ఎదిగే పిల్లలు, సాధికారత పొందిన మహిళలు, బలమైన భవిష్యత్ తరాన్ని నిర్మించడం కూడా అందులో భాగమని పేర్కొన్నారు. అంగన్వాడీ సేవలను బలోపేతం చేసి, ఇంకా సేవలు అందని కుటుంబాలకు పోషకాహార కార్యక్రమాలను చేరువ చేయాలని సూచించారు. పట్టణీకరణ నేపథ్యంలో వలన కుటుంబాలు, బలహీన వర్గాల అవసరాలకు అనుగుణంగా పట్టణ పోషకాహార సేవలను మరింత సమర్థవంతంగా అందించాలన్నారు. కిశోర బాలికల్లో రక్తహీనత నివారణ, ఆరోగ్యకరమైన ఆహారం, రుతుక్రమ ఆరోగ్యం, జీవన నైపుణ్యాలు, బాల్య వివాహాలు, చిన్న వయసులో గర్భధారణ నివారణతో పాటు విద్య, భవిష్యత్ అవకాశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. కిశోరి వికాసం, నఖి, యువ గ్రూపులు, బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలను బలోపేతం చేయాలని సూచించారు. సేవల సంఖ్య కంటే వాటి ద్వారా ప్రజల జీవితాల్లో వస్తున్న మార్పులను అంచనా వేయాలని, మె-రుగైన పర్యవేక్షణ, సిబ్బంది సామర్ధ్యాభివృద్ధి, డేటా వినియోగానికి ప్రాధాన్యమివ్వాలని అన్నారు. వివిధ శాఖలు, స్థానిక సంస్థలు, స్వచ్చంద సంస్థలు, అభివృద్ధి భాగస్వాముల సమన్వయంతో పోషకాహార ఫలితాలను మెరుగుపరచాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 'మార్గదర్శి- ఆంధ్రప్రదేశ్ న్యూట్రిషన్ అడ్వైజరీ గ్రూప్ 'ను ఏర్పాటు చేసి నిపుణుల సాంకేతిక సలహాలతో పోషకాహార విధానాలు, కార్యక్రమాల అమలును మెరుగుపరచనున్నట్లు తెలిపారు. భారత ప్రభుత్వం, నీతి ఆయోగ్ ఆమోదంతో ప్రపంచ బ్యాంకు సాంకేతిక సహకారంతో నిర్వహించిన ఈ సదస్సులో వెలువడే సూచనలను వచ్చే ఒకటి నుంచి రెండేళ్లలో అమలు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మార్గదర్శి పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో మహిళా అభివృద్ధి. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సూర్యకుమారి, డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, మేఘాలయ అదనపు ప్రధాన కార్యదర్శి సంపత్ కుమార్, తమిళనాడు ఐసీడీఎస్ మిషన్ డైరెక్టర్ కె. శాంతి, వీల్స్ గ్లోబల్ ఫౌండేషన్ కన్సల్టెంట్ రూపాల్ దళాల్ తదితరులు ప్రసంగించారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్లు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, ద్వాక్రా, మెప్మా మహిళలు పాల్గొన్నారు.