18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
అదరగొట్టిన అర్ష్ దీప్
మూడో టీ20లో విండీస్ పై భారత్ గెలువు
ఇండోర్: పరుగులు వెల్లువెత్తుతాయని భావించిన మూడో టీ20లో బంతికి, బ్యాట్‌కు మధ్య ఆసక్తికర పోరు జరిగింది. బౌండరీ విస్తీర్ణం తక్కువగా ఉన్న ఈ మైదానంలో మొదట భారత బ్యాటర్లు చేసింది 228 స్కోరు. ఇది ప్రత్యర్థికి తక్కువ లక్ష్యమే అని అనుకున్నా.. మన బౌలర్లు ఈసారి తమ వదును చూపించారు. కరీబియన్ల హిట్టింగ్ కు ముకుతాడు వేశారు. దీంతో ఆదివారం జరిగిన ఈ మూడో టీ20లో భారత్ 14 పరుగుల తేడాతో గెలిచి సిరనలో 2-1 ఆధిక్యం అందుకుంది. అభిషేక్ శర్మ (30 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 69) తుఫాన్ ఇన్నింగ్స్ భారత్ గెలువులో కీలకంగా నిలిచింది. ముందుగా భారత్ 20 ఓవర్లలో 223 వరుగులకు ఆలౌటైంది. ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌లో 37), తిలక్ వర్మ (28) రాణించారు. ఛేదనలో విండీస్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 209 వరుగులు చేసి ఓడింది. హెట్మయెర్ (26 బంతుల్లో 43), కమిల్ పూరన్ (42), స్ప్రింగర్ (11 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 35 నాటౌట్), రూథర్‌ఫోర్డ్ (22) ఫర్వాలేదనిపించారు. ప్లేయర్ ఆఫ్ మ్యాచ్' అర్షద్పనకు 3, సమన్‌కు 2 వికెట్లు దక్కాయి. నాలుగో మ్యాచ్ బుధవారం హైదరాబాద్‌లో జరుగుతుంది.
దెబ్బతీసిన అర్హప్: ఛేదనలో విండనకు రెండో ఓవర్లోనే గట్టి షాక్ తగిలింది. ఫామ్‌లో ఉన్న కెప్టెన్ హోప్ (5)ను అర్హదీప్ బౌల్ట్ చేశాడు. అయితే కమిల్, హెట్మయెర్ ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరి జోరుకు పవర్స్లోలో జట్టు 54/1 స్కోరుతో నిలిచింది. కానీ ఏడో ఓవర్లో హెట్‌మయెర్‌ను నమన్ అవుట్ చేయడంతో రెండో వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. పోవెల్ (5) మళ్లీ నిరాశపర్చగా.. 11వ ఓవర్లో కమిల్‌ను కూడా నమన్ దెబ్బతీశాడు. ఈ దశలో రూథర్‌ఫోర్డ్.. శాంప్సన్ సహకారంతో ఐదో వికెట్‌కు 46వరుగులు జోడించాడు. 18వ ఓవర్లో పాల్, రూథర్త్ఫోర్డను అర్హడీప్ అవుట్ చేయడంతో విండీస్ ఓటమి ఖరారైంది. చివరి ఓవర్లో స్ప్రింగర్ 6,4,6,6తో బాదుడు ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది.
ఆదుకున్న అభిషేక్-ఇషాన్: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆరంభంలో ఇబ్బందిపడినా.. ఓపెనర్ అభిషేక్, ఇషాన్‌ల ఎదురుదాడితో స్కోరు దూసుకెళ్లింది. రెండో వికెట్‌కు ఈ జోడీ 40 బంతుల్లోనే 108 పరుగులను నమోదు చేసింది. ఆ తర్వాత తిలక్, నితీశ్ (21), అక్షర్ (20) కాసేపు క్రీజులో నిలవడంతో స్కోరు 200 దాటగలిగింది మరోవైపు ఫామ్‌లోకి వచ్చాడనుకున్న ఓపెనర్ సంజూ శాంసన్ (3)కు షాకిస్తూ అతడిని షమార్ జోసెఫ్ అవుట్ చేశాడు. అయితే మూడో ఓవర్లో అభిషేక్ 4,6,6తో గేరు మార్చాడు.
అటు ఇషాన్ సైతం పాల్ ఓవర్లో 3 ఫోర్లు రాబట్టడంతో స్కోరు గాడిన పడింది. ఆరో ఓవర్లోనూ అభిషేక్ 6,4,4తో చెలరేగి 18 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. మరోవైపు పవర్ ప్లేలో భారత్ 87/1 రన్స్ నిలిచింది. 8వ ఓవర్లోనే జట్టు స్కోరు వందకు చేరిన దశలో స్పిన్నర్ చేజ్ డబుల్ ఝలక్ ఇచ్చాడు. ఒకే ఓవర్లో ఇషాన్, శ్రేయాస్ (1)ల వికెట్లు తీశాడు. ఆ వెంటనే అభిషేక్, నమన్ (10) కూడా వరుస ఓవర్లలో పెవిలియన్ చేరారు. ఈ దశలో తిలక్, నితీశ్ జోడీ ఆరో వికెట్‌కు 36 వరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. అలాగే లోయరార్డర్లో ప్రిన్స్ (13 నాటౌ ట్), అర్షిదీప్ (11) ఫర్వాలేదనిపించగా భారత్ సవాల్ విసిరే స్కోరందుకుంది.
బౌండరీ వెళ్లిందనుకుని..
జోరు మీదున్న తిలక్ వర్మ అనూహ్య రీతిలో రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. 17వ ఓవర్లో మోటీ వేసిన లో ఫుల్ టాస్‌ను అక్షర్ బలంగా ఆడాడు. సింగిల్ పూర్తి చేశాక వీరిద్దరు రెండో రన్ కోసం ప్రయత్నించారు. కానీ బంతి బౌండరీకి వెళ్లిందని భావించి తిలక్ తన పరుగును మధ్యలోనే ఆపి నెమ్మదిగా నాన్ స్ట్రయికింగ్ ఎండ్ వైపు నడుచుకుంటూ వచ్చాడు. అయితే అప్పటికే ఆ బంతిని అద్భుతంగా ఆపిన కమిల్.. కీపర్ హోవ్నకు త్రో వేయగా తను బౌలర్ మోటీకి అందించాడు. అప్పటికి నింపాదిగా వస్తున్న తిలకు మోటీ రనౌట్ చేయడంతో షాక్‌కు గురయ్యాడు. అంతర్జాతీయ టీ20ల్లో తక్కువ బంతుల్లో (1024) 2 వేల పరుగులు సాధించిన బ్యాటర్‌గా అభిషేక్. అలాగే ఒకే క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక సిక్సర్లు (68) బాదిన బ్యాటర్ (శాశ్వత సభ్యదేశాల నుంచి)గా సూర్యకుమార్‌తో సంయుక్తంగా టాప్‌లో నిలిచాడు.