అంతర్జాతీయ ప్రమాణాలతో ఎక్స్టెన్స్ కేంద్రాలుగా మార్చాలి
విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆకాంక్ష
నిమ్మకూరులో ఐఐటీ-జేఈఈ, నీట్ అకాడెమీ ఏర్పాటుకు నిర్ణయం
అమరావతి,: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలో అకడమిక్ ఎక్సలెన్స్ పై దృష్టి సారించాలని విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులు, ఉపాధ్యా యులను నిర్దేశించారు. ఏపీ రెసిడెన్షియల్ ఎడుకోవని 69వ వర్నిషన్ బార్ మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన శుక్రవారం ఉండవల్లి నివాసంలో జరిగింది. ఈ సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లా డుతూ, ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రతిభావం తులను తయారుచేసే కేంద్రాలుగా మారాలని ఆకాం క్షించారు. ఏపి రెసిడెన్షియల్ స్కూళ్లు అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ ఎక్సలెన్స్ పై దృష్టి సారిం చాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో ఉ త్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులతో తొలిసారి పత్రికా ప్రకటనలు ఇచ్చి సెలబ్రేట్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పటివరకు ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లలో విద్యనభ్యసించిన వారిలో దాదాపుగా 27 మంది ఐఏఎస్, 20 మంది ఐపీఎస్, 18మంది ఐఆర్ఎస్, నలుగురు ఐఎఫ్ఎస్ లుగా, ఇక మరెం తో మంది సమాజంలో అత్యున్నత స్థానాల్లో సేవలందిస్తు న్నారని అధికారులు తెలిపారు. దీనిపై మంత్రి లోకేష్ హర్షం వ్యక్తంచేశారు.
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలుగా 10 రెసిడెన్షియల్ స్కూల్స్....
రాష్ట్రంలో 10 ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లుగా అభివృద్ధి చేసేందుకు బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ (బీవోజీ) ఆమోదం తెలిపింది. (ఇప్పటికే తాడికొండ, కొడిగిన హళ్లి పాఠశాలలు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లుగా ఉన్నాయి) కృష్ణాజిల్లా నిమ్మకూరు ఏపీఆర్ జేసీ కళాశాలలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐఐటి-జేఈఈ నీట్ అకాడమీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని శ్రీ ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లను జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేయడానికి సమా వేశం ఆమోదించింది. జగ్గంపేట నియోజకవర్గంలోని భూపతి పాలెం ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ లో చరల్ క్లాస్ స్పోర్స్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చేసి, ఎడ్యుకేషన్ మరియు క్రీడా హబ్ తీర్చిదిద్దడానికి గల అవకాశాలను పరిశీలించాలని మంత్రి లోకేష్ అధికారులకు సూచించారు. ఈనమా వేశంలో మానవవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ రంజిత్ బాషా, ఉన్నత విద్య డైరక్టర్ నారాయణ భరత్ గుప్త, ఎస్ సీఈఆర్ టీ డైరక్టర్ ఎంవి కృష్ణారెడ్డి, ఏపీ విద్య మౌలిక సదుపాయాల సంస్థ ఎండి దీవెన్ రెడ్డి, రెసిడెన్షియల్ స్కూల్స్ కార్యదర్శి కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.