రాష్ట్ర వ్యాప్తంగా 105 చెరువుల ఆధునీకరణ
రూ.50 కోట్లతో పనులు.. గ్రీన్.. క్లీన్.. హెల్తీ వాతావరణం
రూ.73 లక్షలతో ఎక్కే పాలెం మైసమ్మ చెరువుకు సొబగులు
వాకింగ్ ట్రాక్, ఓపెన్ ఎయిర్ జిమ్, చిల్డ్రన్స్ పార్కుతో ప్రత్యేక ఆకర్షణ
లాంఛనంగా ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో మరో 11 చెరువుల అభివృద్ధికి శ్రీకారం
పిఠాపురం : గ్రామీణ చెరువుల రూపురేఖలు మారుతున్నాయి. ఒకప్పుడు సాగునీరు, పశువుల అవసరాలకే పరిమితమైన చెరువులను ఇప్పుడు పచ్చదనం, ఆహ్లాదం, ఆరోగ్యం మేళవించిన ప్రజా వేదికలుగా తీర్చిదిద్దే కార్యక్రమం ఊపందుకుంది. ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా రూ.50 కోట్ల వ్యయంతో 105 చెరువుల ఆధునీకరణ, సుందరీకరణ పనులు చేపట్టగా, పిఠాపురం నియోజకవర్గంలోని ఫకృద్దీన్ పాలెం మైసమ్మ చెరువు ఈ కార్యక్రమానికి నమూనాగా నిలిచింది. రూ.73 లక్షల వ్యయంతో సర్వాంగ నుందరంగా తీర్చిదిద్దిన మైనమ్మ చెరువు, వాకింగ్ ట్రాక్, ఓపెన్ ఎయిర్ జిమ్, చిల్డ్రన్స్ పార్కును ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోమవారం ప్రారంభించారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా చెరువు వరిసరాలను వరిశీలించిన ఆయన, పిఠాపురం వరిధిలో అభివృద్ధి చేసిన మరో 11 చెరువులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కాకినాడ జిల్లా పరిధిలో అభివృద్ది చేసిన 14 చెరువుల వివరాలతో ఏర్పాటు చేసిన గ్యాలరీని సందర్శించారు.
చెరువు గట్టే వాకింగ్ ట్రాక్
మైసమ్మ చెరువు ఆధునీకరణలో నీటి వనరు పరిరక్షణతోపాటు ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చారు. చెరువు గట్టును బలోపేతం చేసి, చుట్టూ వచ్చదనం పెంచారు. ఉదయం, సాయంత్రం గ్రామస్తులు నడక సాగించేందుకు ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. మహిళలు, యువత, వృద్ధులు వ్యాయామం చేసుకునేందుక ఏ ఓపెన్ ఎయిర్ జిమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. పిల్లల కోసం ప్రత్యేక చిల్డ్రన్స్ పార్కును అభివృద్ధి చేయడంతో చెరువు పరిసరాలు గ్రామీణ వినోద కేంద్రంగా మారాయి. జాతీయ భావనను పెంపొందించేలా జెండా స్థూపాన్ని కూడా ఏర్పాటు చేశారు. చెరువు గట్టు వెంట నడిచిన పవన్ కల్యాన్అక్కడున్న భారీ వృక్షాలను వరిశీలించారు. వాటి వయసు, కొన్ని వృక్షాల శాస్త్రీయ నామాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెరువుల అభివృద్ధిలో పర్యావరణ పరిరక్షణ, వచ్చదనానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. చిన్నారులతో కలిసి చిల్డ్రన్స్ పార్కును ప్రారంభించిన పవన్ కల్యాణ్ అక్కడ ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. చిన్నారులతో కొద్దిసేపు ముచ్చటించి వారికి తినుబండారాలు, చాక్లెట్లు అందించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి సదుపాయాలు అందుబాటులోకి వస్తే ప్రజలకు విశ్రాంతి, వినోదంతోపాటు ఆరోగ్య పరిరక్షణకు ఉ పయోగపడతాయని పేర్కొన్నారు.