సామూహిక గృహ ప్రవేశాలకు సిద్ధం కావాలి
హౌసింగ్ ఫర్ ఆల్ లక్ష్యానికి అనుగుణంగా ప్రణాళిక
కేంద్ర సహకారంతో ఇండస్ట్రియల్ టౌన్షిప్ నిర్మాణం
గృహ నిర్మాణ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిశా నిర్దేశం
అమరావతి : రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి 2029 నాటికి సురక్షితమైన, శాశ్వతమైన ఇల్లు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని సంతృప్తి స్థాయిలో అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. 2027 మార్చి నాటికి 5.52 లక్షల కళ్లను పూర్తి చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. గృహ నిర్మాణ శాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్, పీఎం జన్ మన్ సహా వివిధ పథకాల కింద చేపట్టాల్సిన ఇళ్ల నిర్మాణాన్ని వచ్చే నెలలోగా గ్రౌండింగ్ చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 1.5 లక్షల ఇళ్లను పట్టణ ప్రాంతాల్లోనూ నిర్మాణం చేయాలని సీఎం సూచించారు. డిసెంబరు 2026 నాటికల్లా 2.05 లక్షల ఇళ్లు, 2027 మార్చి నాటికి మరో 2.74 లక్షల ఇళ్లు పూర్తి చేసి గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని సీఎం సూచించారు. పీఎంఏవై 1.0, పీఎంఏవై 2.0, పీఎం జన్ మన్ పథకాల కింద రాష్ట్రంలో 18.72 లక్షల ఇళ్ల మంజూరు కాగా.. ఇప్పటి వరకూ 18.20 లక్షల ఇళ్లు పూర్తి అయ్యాయని అధికారులు వివరించారు. ఏపీ హౌసింగ్ కార్పోరేషన్ పరిధిలో మొత్తం 16.11 లక్షల ఇళ్లకు గానూ ఇప్పటికే 11.31 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి అయిందన్నారు. ఏపీ టిద్కో పరిధిలో 2.61 లక్షల ఇళ్లకు గానూ 1.88 లక్షల ఇళ్లు పూర్తి అయ్యాయని సీఎంకు వివరించారు. 2027 డిసెంబరు నాటికి 75 వేల కొత్త గృహాలను మంజూరు అయ్యేలా చూడటంతో పాటు 1.5 లక్షల ఇళ్లను పైప్ లైన్ లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి సూచించారు. దీనికి సంబంధించి కేంద్ర గ్రామీణాభివృద్ధి, పట్టణాభి వృద్ధి శాఖలతో సమన్వయం చేసుకుని అవసరమైన కేటాయింపులు పొందాలని సీఎం స్పష్టం చేశారు.
ఉచిత ఇళ్ల స్థలాలపై ప్రత్యేక కార్యాచరణ
ఇంటి స్థలాలు లేని కుటుంబాల వాస్తవ డిమాండ్‌ను గుర్తించేందుకు ఆర్టీజీఎస్ సహా ఆవాన్ ప్లస్, హౌసింగ్, రెవెన్యూ శాఖల నుంచి డేటాను అనుసంధానం చేసుకుని డూప్లికేషన్ లేకుండా అర్హులను గుర్తించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గ్రామ, వార్డు నచివాలయాల స్థాయిలో ప్రాథమిక లబ్దిదారుల జాబితాలను ప్రచురించి అభ్యంతరాలను స్వీకరించి పారదర్శకంగా పరిష్కరించిన అనంతరం తుది జాబితాలను ఖరారు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే ఉన్న లే అవుట్లలో నిర్మాణాలు చేపట్టని భూమిని అవసరానికి అనుగుణంగా 2 లేదా 3 సెంట్ల ప్లాట్లుగా పునర్వ్యవస్థీకరించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఖాళీ స్థలాల గుర్తింపు, అర్హులైన లబ్దిదారులకు మ్యాపింగ్, నిర్మాణం పూర్తయ్యే వరకు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సీఎం సూచించారు. కుప్పం నియోజకవర్గంలోనూ సాచురేషన్ విధానంలో గృహ నిర్మాణం చేపట్టాలన్నారు. 2029 నాటికి రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి సురక్షితమైన, శాశ్వతమైన ఇల్లు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. శాఖల మధ్య సమన్వయంతో అందరికీ ఇళ్లు లక్ష్యాన్ని పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
పారిశ్రామిక టౌన్ షిప్ ల నిర్మాణం
కేంద్ర సహకారంతో వివిధ ప్రాంతాల్లో పారిశ్రామిక టౌన్ షిప్ లను నిర్మించే అంశంపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి గృహ నిర్మాణ శాఖను ఆదేశించారు. రాష్ట్రంలోని శ్రీసిటీ సహా వివిధ పారిశ్రామిక ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ టౌన్ షిప్ ల ఏర్పాటు ద్వారా ఆర్ధిక లావాదేవీలు పెరిగేందుకు ఆస్కారం ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ ఏపీఐఐసీతో సమన్వయం చేసుకుని ఈ టౌన్ షిప్ ల నిర్మాణం చేపట్టాలన్నారు. ఈ సమీక్షలో గృహ నిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారథి, హౌసింగ్ శాఖ, ఆర్ధిక శాఖ ఉ న్నతాధికారులు హాజరయ్యారు.
రేవు వారాణసికి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు వారాణసిలో పర్యటించనున్నారు. 17వ తేదీ ఉదయం 10 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో వారాణసికి చేరుకుంటారు. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్లో జరిగే వారాణసి- వడ్డర్ సేవా సంకల్ప్ యాత్ర కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3.30 నుంచి 4 గంటల మధ్య కాశీ విశ్వనాథ స్వామిని దర్శించుకుంటారు. సాయంత్రం 5కు వారాణసిలో బయలుదేరి విజయవాడకు చేరుకుంటారు.