ఎంపీలు, ఎమ్మెల్యేలపై 4000కి పైగా కేసులు
14 రాష్ట్రాల సీఎంలపై తీవ్ర నేరాభియోగాలు
వాటి విచారణపై మార్గదర్శకాలను కోరిన పిల్
వెంటనే విచారించేందుకు సుప్రీం సమ్మతి
న్యూఢిల్లీ: ప్రజా ప్రతినిధులపై నమోదైన క్రిమినల్ కేసుల్లో విచారణను సత్వరం పూర్తి చేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ జరవనుంది. 2016 నాటి ఈ పిటిషన్‌ను సత్వరం పరిష్కరించాల్సిన కేసుల జాబితాలో చేర్చేందుకు బెంచ్ అనుమతించింది. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది. ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల విచారణకు సంబంధించి సత్వరం మార్గదర్శకాలు జారీచేయాలని పిటిషనర్, ఈ కేసులో అమికస్ క్యూరీ అయిన సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా కోరారు. "దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధుల్లో 401 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. లోక్సభఎంపీల్లో 251 మంది, రాజ్యసభ ఎంపీల్లో 75 మంది హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు, అపహరణలు వంటి అతి తీవ్రమైన నేరాభియోగాలను ఎదుర్కొంటున్నారు. అసెంబ్లీలను కూడా కలుపుకొంటే ఎంపీలు, ఎమ్మెల్యేలపై 4వేలకు పైగానే కేసులున్నాయి. 14 రాష్ట్రాల ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇందులో కర్ణాటక సీఎం శివకుమారి 19 కేసులు, పశ్చిమబెంగాల్ సీఎం సువేందు అధికారిపై 29 కేసులు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై 89 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసుల్లో విచారణను త్వరితగతిన, సమర్థవంతంగా పూర్తి చేసేలా స్పష్టమైన మార్గదర్శకాలను ఇవ్వాల్సి ఉంది" అని ఆయన వాదించారు.