12 రోజుల్లో కోటిన్నర దరఖాస్తులు!
2027లో జరగనున్న ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచకప్‌పై అభిమానుల్లో అప్పుడే అంచనాలు ఆకాకాన్నంటాయి. టోర్నీ ఆరంభానికి ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికీ, టికెట్ల కోసం ప్రపంచవ్యాప్తంగా అనూహ్య స్పందన లభిస్తోంది. టికెట్ బ్యాలెట్ ప్రక్రియ ప్రారంభమైన కేవలం 12 రోజుల్లోనే ఏకంగా 1.5 కోట్లకు పైగా దరఖాస్తులు రావడం క్రికెట్ అభిమానుల్లో నెలకొన్న ఉత్సాహానికి నిదర్శనంగా నిలుస్తోంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు ఈ మెగా టోర్నీకి సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఐసీసీ వెల్లడించిన వివరాల ప్రకారం.. 142 దేశాల నుంచి అభిమానులు టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 1,50,83,752 టికెట్ దరఖాస్తులు రాగా, 44,23,417 బ్యాలెట్ రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైన మొదటి వారంలోనే 10 లక్షల దరఖాస్తులు రాగా, ఆ తర్వాత అమాహ్యంగా ఈ సంఖ్య పెరిగింది. దాదాపు 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ మెగా టోర్నీ ఆఫ్రికా గడ్డపై జరగనుండటం విశేషం. అంతేకాకుండా, నూతన ఫార్మాట్లో జరగనున్న ఈ 14వ ఎడిషన్‌ను క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద ఈవెంట్ నిర్వహించాలని నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ అనూహ్య స్పందనపై ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నంజోగ్ గుప్తా మాట్లాడారు. "ప్రపంచకప్ టోర్నీకి ఉన్న ప్రతిష్ఠ ఆతిథ్య దేశాలుగా ఆఫ్రికా దేశాలకు ఉన్న ఆకర్షణ, టోర్నీకి ముందు ఐసీసీ చేపట్టిన ప్రచార కార్యక్రమాలే ఈ భారీ స్పందనకు కారణం. ఇది మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది" అని వివరించారు. టోర్నీకి ఇంకా ఏడాది సమయం ఉన్నందున, రానున్న రోజుల్లో 360 డిగ్రీల యాక్టివేషన్లు, వివిధ వేదికల ద్వారా ప్రచార కార్యక్రమాలతో అభిమానుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచుతామని ఆయన తెలిపారు. అభిమానులు టికెట్ల బ్యాలెట్ కోసం రిజిస్టర్ చేసుకునేందుకు 2026 నవంబర్ 21 చివరి తేదీగా నిర్ణయించారు. సరిగ్గా ఏడాది తర్వాత అంటే 2027 నవంబర్ 21న జొహన్నెస్బర్లోని వాండరర్స్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నమెంట్ 2027 అక్టోబర్ 2న సమీబియాలోని విండ్బిక్లో మూడు జట్ల సూపర్ సిరీస్‌లో ప్రారంభం కాసుంది. మొత్తం మీద టోర్నీ ఆరంభానికి ముందే టికెట్లకు ఈ స్థాయిలో డిమాండ్ రావడం, ఈ మెగా ఈవెంట్ పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆసక్తిని స్పష్టం చేస్తోంది.