అక్టోబర్ 10న భారత్-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమాసులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ వురుషుల క్రికెట్ వన్డే ప్రపంచకప్ 2027 షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) గురువారం విడుదల చేసింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నమెంట్ సరికొత్త ఫార్మాట్‌తో అభిమానులను అలరించనుంది. 2023 ఫైనల్‌కు పుసరాషృతంగా, అక్టోబర్ 7న కేప్టాన్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ టోర్నమెంట్లో మొత్తం 14 జట్లు పాల్గొంటాయి. అయితే, గ్రూప్ స్టేజ్‌కు మాత్రం 12 జట్లే అర్హత సాధిస్తాయి. ఆతిథ్య దేశాలుగా దక్షిణాఫ్రికా, జింబాబ్వే నేరుగా అర్హత పొందాయి. వీటితో పాటు, 2026 సెప్టెంబర్ 80 నాటికి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-8లో నిలిచిన జట్లు కూడా నేరుగా క్వాలిఫై అవుతాయి. దీంతో మొత్తం 10 జట్లు ఖరారవుతాయి. మిగిలిన రెండు స్థానాల కోసం క్వాలిఫయర్ టోర్నమెంట్ నిర్వహిస్తారు. ఈ క్వాలిఫయర్‌లో గెలిచిన జట్టు నేరుగా గ్రూప్ స్టేజ్‌లు చేరుకుంటుంది. ఇక క్వాలిఫయర్‌లో 2, 3, 4 స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య 'సూపర్ సిరీస్' జరుగుతుంది. ఈ మూడు జట్ల మధ్య జరిగే రౌండ్ రాబిన్ మ్యాచ్‌ల తర్వాత, అగ్రస్థానంలో నిలిచిన జట్టు గ్రూప్ స్టేజ్‌లో చివరిదైన 12వ జట్టుగా అర్హత సాధిస్తుంది. క్వాలిఫయర్స్ ఓడిపోయిన మిగతా రెండు జట్లు టోర్నీ నుంచి నిష్క్రమిస్తాయి.
గ్రూప్ స్టేజ్ నుంచి సూపర్ 7 వరకు..
గ్రూప్ స్టేజ్‌లో మొత్తం 12 జట్లను ఆరు చొప్పున రెండు గ్రూపులుగా (గ్రూప్ ఏ, గ్రూప్ బీ) విభజిస్తారు. ప్రతి జట్టు తమ గ్రూపులోని మిగతా ఐదు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్ దశ ముగిసేసరికి, రెండు గ్రూపులలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు (303=6) నేరుగా తదుపరి దశ అయిన 'సూపర్ 7'కు అర్హత సాధిస్తాయి.
ఇక ఏడో జట్టు ఎంపిక ఆసక్తికరంగా ఉంటుంది. రెండు గ్రూపుల్లో నాలుగో స్థానంలో నిలిచిన జట్లను పోలుస్తారు. ఈ రెండింటిలో ఏ జట్టుకు ఎక్కువ పాయింట్లు ఉంటే, ఆ జట్టు ఏడో బెర్తును దక్కించుకుంటుంది. పాయింట్లు సమానంగా ఉంటే నెట్ రన్ రేట్ ఆధారంగా నిర్ణయిస్తారు. అంటే, గ్రూపులో నాలుగో స్థానంలో ఉన్నా టోర్నీలో ముందడుగు వేసే అవకాశం ఉంటుంది.
ఏమిటీ 'నూపర్ 7'.. ప్రీ-నీడింగ్ అంటే ఏమిటి?
గ్రూప్ దశ ముగిశాక, ప్రతి గ్రూప్ లోని టాప్-3 జట్లు, నాలుగో స్థానంలో నిలిచి రెండు గ్రూపుల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన ఒక జట్టుతో కలిపి మొత్తం ఏడు జట్లు 'సూపర్ 7' దశకు చేరుకుంటాయి. ఇదే ఈ పరల్డ్ కప్‌లో సరికొత్త ప్రయోగం. గ్రూప్ స్టేజ్ నుంచి వచ్చిన ఏడు జట్లు ఈ దశలో పోటీపడతాయి. ముఖ్యంగా, గ్రూప్ స్టేజ్‌లో సాధించిన పాయింట్లను ఇక్కడ పరిగణనలోకి తీసుకోరు. ప్రతి జట్టు సున్నా పాయింట్లతో ఈ దశను ప్రారంభిస్తుంది. సూపర్ 7లో ప్రతి జట్టు మిగిలిన ఆరు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అభిమానులకు, ప్రసారదారులకు సౌలభ్యం కోసం ఐసీసీ 'ప్రీ-సీడింగ్' విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం, కొన్ని అగ్ర జట్లకు ముందుగానే సీడింగ్ కేటాయించారు (ఉ దాహరణకు, ఇండియాకు ూ1, ఆస్ట్రేలియాకు 2, పాకిస్థాన్‌కు ూ3), ఒకవేళ ఈ జట్లు సూపర్ 7కు అర్హత సాధిస్తే, వారికి కేటాయించిన సీడింగ్ ప్రకారమే మ్యాచ్‌లు జరుగుతాయి. ఒకవేళ నీడింగ్ ఉన్న జట్టు అర్హత సాధించలేకపోయి, ఆ స్థానంలో మరో జట్టు (సీడింగ్ లేనిది) వస్తే, ఆ కొత్త జట్టుకు పాత జట్టు సిడింగ్ వర్తిస్తుంది. దీనిపల్ల షెడ్యూల్లో ఎలాంటి మార్పులు లేకుండా మ్యాచ్‌లు సజావుగా సాగుతాయి.
సెమీ- ఫైనల్స్ మరియు ఫైనల్
సూపర్ 7 దశ ముగిసేసరికి పాయింట్ల పట్టికలో టాప్-1లో నిలిచిన జట్లు సెమీ-ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. మొదటి స్థానంలోని జట్టు నాలుగో స్థానంలోని జట్టుతో ఒక సెమీస్ లో, రెండు-మూడు స్థానాల్లోని జట్లు మరో సెమీస్ లో తలపడతాయి. సెమీ ఫైనల్స్‌లో గెలిచిన రెండు జట్లు ఫైనల్లో ప్రపంచ విజేతగా నిలిచేందుకు పోటీపడతాయి. సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే కూడా ఉంటుంది. ఈ కొత్త ఫార్మాట్ టోర్నీకి మరింత ఉత్కంఠను జోడిస్తుందని ఐసీసీ ఆశిస్తోంది.
కీలక మ్యాచ్‌లు, నాకౌట్ దశ
- క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే భారత్-పాకిస్థాన్ హై-వోల్టేజ్ మ్యాచ్ అక్టోబర్ 10న జోహన్నెస్‌బర్గ్ జరగనుంది. ఆతిథ్య జటైన దక్షిణాఫ్రికా అక్టోబర్ 9న న్యూజిలాండ్, జింబాబ్వే అక్టోబర్ 11న ఆఫ్ఘనిస్థాన్‌తో తమ ప్రస్థానాన్ని ప్రారంభిస్తాయి.
- తొలి సెమీఫైనల్ నవంబర్ 17న కేప్ టౌన్లో, రెండో సెమీ ఫైసల్ సపంబర్ 18న ష్వాన్లో జరుగుతాయి. ఇక, విశ్వవిజేతను తేల్చే ఫైనల్ మ్యాచ్ నవంబర్ 21న జోహన్నెస్బర్లోని వాండరర్స్ స్టేడియంలో జరగనుంది. సెమీస్, ఫైనల్స్క రిజర్వ్ డేలను కూడా కేటాయించారు.
- ఈ షెడ్యూల్ ప్రకటనపై ఐసీసీ చైర్మన్ జై షా మాట్లాడుతూ, "ఈ షెడ్యూల్ ప్రకటన, టికెట్ల కేటాయింపు ప్రారంభం కావడం టోర్నమెంట్ సన్నాహాల్లో కీలక మైలురాళ్లు, మూడు దేశాలు క్రికెట్ అభిమానులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తాయని ఆశిస్తున్నాం," అని తెలిపారు.