దేశవ్యాప్తంగా 70కి పైగా ఔషధ తయారీ
సంస్థల భాగస్వామ్యం 6,000 నుంచి
8,000 వేల ఫార్మా రంగ నిపుణులు హాజరవుతారని అంచనా
విజయవాడ, : ఔషధ రంగంలో తయారీదారులు, పంపిణీదారులు, వ్యాపారవేత్తలు, ఫార్మా రంగ నిపుణులను ఒకే వేదికపైకి తీసుకువచ్చే 17వ ఇండియన్ ఫార్మా ఫెయిర్ ఈ నెల 23, 24 తేదీల్లో నగరంలోని ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించను న్నారు అని తెలిపారు. 23వ తేదీ ఉదయం 11 గంటలకు ఫార్మెక్సిల్ ఇండియా వ్యవస్థాపకులు, మాజీ డైరెక్టర్ జనరల్, భారత ప్రభుత్వ నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రెసింగ్ అథారిటీ (ఎన్.పి.పి.ఎ) మాజీ డైరెక్టర్ అప్పాయి పద్మనాభుని ఈ ప్రదర్శనను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రదర్శనకు కృష్ణా జిల్లా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ మద్దతు, సహకారం అందిస్తున్నారని తెలిపారు. ఈ ఫార్మాఫెయిర్ కు అసోసియేషన్ అధ్యక్షుడు సి.సి. కేశవరావు, కార్యదర్శి పి. మురళీకృష్ణ సహకారంతో కార్యక్రమం నిర్వహించబ డుతోందని తెలిపారు. బుధవారం నాడు జరిగిన విలేఖ రుల సమావేశంలో బి.ఎస్. బండారి ఈ కార్యక్రమ వివరాలను వివరిస్తూ... ఈ ఏడాది ప్రదర్శనలో దేశవ్యాప్తంగా 70కి పైగా ఔషధ తయారీ సంస్థలు పాల్గొననున్నాయి. మెడికెంట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, సైకోకేర్ హెల్త్, ఫిజికెమ్ ఫార్ములేషన్, జెనిప్ ఫార్ములేషన్ బెస్ట్ బయోటెక్, తిరువిజన్ మెడికేర్, సురక్ష ఫార్మా, య-ఎనైటెడ్ లాబొరేటరీస్, సెంట్ క్యూర్, బజాజ్ ఫార్ములేషన్స్ బజాజ్ న్యూట్రాస్యూటికల్స్, యూనిగ్రో ఫార్మాస్యూటికల్ బయోఫార్ లైఫ్సన్సెస్ తదితర సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి అని తెలిపారు. ఈ ఫెయిర్లో ఫార్ములేషన్స్, జనరిక్ మందులు, న్యూట్రాస్యూటికల్స్, సౌందర్య ఉత్పత్తులు, మూలికా, ఆయుర్వేద ఉత్పత్తులు, పశువైద్య ఔషధాలతో పాటు థర్డ్ పార్టీ తయారీ, కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్, పీసీడీ ఫ్రాంచైజీలు, లోన్ లైసెన్సింగ్, ఎగుమతులకు సంబంధించిన సేవలు ప్రదర్శించబడతాయి అని తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి సుమారు 6,000 నుంచి 8,000 మంది ఫార్మా రంగ నిపుణులు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నామని తెలిపారు. ఈ , ఫెయిర్ లో మార్కెటింగ్ సంస్థలు, ఔషధ పంపిణీదారులు, ఎగుమతి సంస్థలు, ఆసుపత్రుల కొనుగోలు విభాగాల , ప్రతినిధులు, స్టాకిస్టులు తదితరులు పాల్గొననున్నారు అని , అన్నారు. ఔషధ తయారీదారులు తమ ఉత్పత్తుల నాణ్యతను ప్రదర్శించేందుకు, బ్రాండ్ గుర్తింపును పెంపొందించు కునేందుకు, నూతన వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ ప్రదర్శన ఉ పయోగపడు తుందని నిర్వాహకులు పేర్కొన్నారు. రిటైలర్లు, హోల్సేల ర్లు, పంపిణీదారులు కొత్త ఉ త్పత్తులను తెలుసుకోవడానికి, ధరలు మరియు నాణ్యతను పోల్చి చూడడానికి, వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఈ వేదిక దోహదపడుతుందని తెలిపారు. దక్షిణ భారతదేశంలో ఫార్మా వాణిజ్యానికి విజయవాడను ఒక ముఖ్యమైన కేంద్రంగా మరింత అభివృద్ధి చేయడంలో ఇండియన్ ఫార్మా ఫెయిర్ కీలక పాత్ర పోషిస్తుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. విలేఖరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు సి.సి. కేశవరావు, కార్యదర్శి పి. మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.