దసరా మహోత్సవాల్లో దుర్గమ్మ దర్శనానికి
పోటెత్తిన భక్తజనం భారీ సంఖ్యలో తరలివచ్చిన భవానీ దీక్షాపరులు
విజయవాడ, :దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి భక్తులు భారీ సంఖ్యలో కిలో తరలివస్తున్నారు. అక్టోబరు 11 నుంచి 20వ తేదీ వరకు మొదటి పది రోజుల్లో మొత్తం 15,05,359 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, 11వ రోజైన బుధవారం అక్టోబరు 21న రాత్రి 7 గంటల వరకు సుమారు 1,55,000 మంది దర్శించుకున్నారు. దీంతో 11 రోజుల్లో అమ్మవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 16,60,359కు చేరింది. రోజువారీ వివరాల ప్రకారం అక్టోబరు 11న 1,47,242 మంది, 12న 1,50,437 మంది, 13న 1,44,467 మంది, 14న 1,17,802 మంది, 15న 1,27,178 మంది, 16న 2,32,258 మంది, 17న 1,32,018 మంది, 18న 1,54,871 మంది, 19న 1,47,354 మంది, 20న 1,51,732 మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు క్యూలైన్లలో పటిష్ట ఏర్పాట్లు చేశారు. మంచినీరు, ప్రసాదం పంపిణీ నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. భక్తులు దేవస్థాన నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకుంటున్నారని అధికారులు తెలిపారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భవానీ దీక్షావరుల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.