అప్పులకుప్పగా ఉన్న రాష్ట్రం
చంద్రబాబు అనుభవంతో గట్టునపడింది.
పల్లెపండుగ 3.0 కింద 11,085 కోట్లతో పనులు
ప్రజలు భాగస్వాములు కావాలి: డిప్యూటీ సీఎం
నెల్లూరు: వైసీపీ ఐదేళ్ల ప్రభుత్వంలో కంటే ఈ రెండేళ్లలో పది రెట్లు ఎక్కువగా అభివృద్ధి పనులు జరిగాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. నెల్లూరు జిల్లా రామాపురంలో మంగళవారం నిర్వహించిన పల్లె పండుగ 3.0 వేదికపై ఆయన మాట్లాడారు. 2019-24 మధ్య బ్లీచింగ్ కొనడానికి కూడా పంచాయతీల పద్ద డబ్బులు లేపని, ఈ రెండేళ్ల కూటమి పాలనలో ప్రతి గ్రామం నమగ్రాభివృద్ధి దిశగా సాగుతోందన్నారు. "ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న అమేజింగ్ ఫైనాన్షియల్ స్ట్రేటజీ వల్ల మాత్రమే అభివృద్ధి సాధ్యపడింది. అప్పుల కుప్పగా ఉన్న రాష్ట్రం గట్టున పడిందంటే దానికి సీఎం అనుభవం, దక్షతలే కారణం. ఉద్యమ స్పూర్తితో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ప్రజలు భాగస్వామ్యులు కావాలి. ప్రతి పనినీ పరిశీలించాలి. నాణ్యత పరంగా లోపం కనిపిస్తే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి' అని సూచించారు. వైసీపీ ప్రభుత్వ కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 880 కిమీ సీసీ రోడ్లు వేస్తే, చంద్రబాబు నాయకత్వాన ఈ ప్రభుత్వం 9వేల కిమీ సీసీ రోడ్లు నిర్మించిందని తెలిపారు. వల్లెవండుగ 1.0, 2.0లో 9వేల కోట్లతో అభివృద్ధి పనులు చేశామని వివరించారు. పల్లెపండుగ 3.0లో 11,085 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తామన్నారు. రూ. 50వేల కోట్లతో జలజీవన్ మిషన్ వేగవంతం చేయబోతున్నామన్నారు. 1.30 లక్షల కోట్లతో జలజీవన్, అమరజీవి జలధార పథకాల ద్వారా మల్టీ విలేజ్ స్కీం, సింగిల్ విలేజ్ స్కీం పనులు చేపడుతున్నామని, అక్టోబరు 5న ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థావన చేయనున్నట్లు ప్రకటించారు. వల్లెపండుగ 8.0 కింద ఆరువేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 9వేల కిలోమీటర్ల బీటీ రోడ్లు, మరో 22,500 మినీ గోకులాలు, 50 వేల హెక్టార్లలో వండ్ల తోటలు అభివృద్ధి చేయబోతున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బంజారా ఆవాసాల్లో ఈ పనులు ఒక మహాయజ్ఞంతా చేయబోతున్నామని తెలిపారు. పైలెట్ ప్రాజెక్టుగా నియోజకవర్గానికి ఒక డొంక రోడ్డును నిర్మిస్తామని, తరువాత మిగిలిన రోడ్లను కూడా దశలవారీగా నిర్మిస్తామని చెప్పారు.